Similar Songs
Credits
PERFORMING ARTISTS
Yuvan Shankar Raja
Lead Vocals
N. Linguswamy
Music Director
COMPOSITION & LYRICS
Yuvan Shankar Raja
Composer
Vennelakanti
Lyrics
PRODUCTION & ENGINEERING
Subash Chandra Bose
Producer
Lyrics
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ధ్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోనీ
అని అబద్దాలు చెప్పలేనులే
నీ జతలోన నీ జతలోన
ఈ ఎండకాలం నాకు వానాకాలం
నీ కలలోన నీ కలలోన
మది అలలాగ చేరు ప్రేమ తీరం
ఏహియే
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే హే హేయ్
చిరుగాలి తరగంటి నీమాటకే
ఎద పొంగేను ఒక వెల్లువై
చిగురాకు రాగాల నీ పాటకే
తనువూగేను తొలిపల్లవై
ప్రేమ పుట్టాక నాకళ్లలో
దొంగచూపేదో పురివిప్పెనే
కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది
ఈ సయ్యాట బాగున్నది
నువ్వల వేస్తే నువ్వల వేస్తే
నా ఎద మారే నా కథ మారే
అరె ఇది ఏదో ఒక కొత్త దాహం
అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం
వేహివే
ఒకసారి మౌనంగ నను చూడవే
ఈ నిమిషమే యుగమౌనులే
నీ కళ్లలో నన్ను బందించవే
ఆ చెర నాకు సుఖమౌనులే
నిన్ను చూసేటి నా చూపులో కరిగే
ఎన్నెన్ని మునిమాపులో
పసిపాపై ఇలా నా కనుపాపలే
నీ జాడల్లో దోగాడెనే
తొలి సందెలలో తొలి సందెలలో
ఎరుపే కాదా నీకు సింధూరం
మలి సందెలలో మలి సందెలలో
నీ పాపిటిలో ఎర్రమందారం
ఏహియే
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ధ్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోనీ
అని అబద్దాలు చెప్పలేనులే
Written by: Vennelakanti, Yuvan Shankar Raja