Upcoming Concerts for Sid Sriram, Ramya Behara, M.M. Sreelekha & Krishna Kanth
Featured In
Top Songs By Sid Sriram
Similar Songs
Credits
PERFORMING ARTISTS
Sid Sriram
Lead Vocals
Ramya Behara
Performer
M.M. Sreelekha
Performer
Krishna Kanth
Performer
COMPOSITION & LYRICS
M.M. Sreelekha
Composer
Krishna Kanth
Songwriter
Lyrics
రానే వచ్చావా వానై నాకొరకే
వేచే ఉన్నాలే
నీతో తెచ్చావా ఏదో మైమరుపే
ఉన్నట్టున్నాలే
నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే
నిన్నే ఎవరంటూ
కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే
నువ్వే కావాలంటూ
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వీ దరికే
నన్నే చేరితివే వెతికే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వు చేరితివే
వెతికే నా చెలివే
ఓ అడిగే అడిగే ప్రాణం అడిగే
తనకేనా ఇచ్చావని
అలిగే అలిగే అందం అలిగే
మీ జంట బాగుందని
పెదవుల మధ్యే సరిహద్దే ఇక రద్దే
అని ముద్దే అడగగనే అలజడిలా అల్లే
మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే
కనికట్టే నీ కనులంచునే ఉంచావులే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వు చేరితివే
వెతికే నా చెలివే
తగిలే గోటికిలా చిగురించే పువ్వులలా
పూదోట విరిసేను నా వీపుకే
మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే
ఆగేనే వచ్చేనే నా ఊపిరే
దూరం నిలబడినా గుండె లోతులనే
నిండేనే నిండేనే నీ వాసనే
చూశా ఈ క్షణమే ఏదో నా కలలో
తీరేలే ఈనాడు నీ రాకతో
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వీ దరికే
నన్నే చేరితివే వెతికే
ఉరికే ఉరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వు చేరితివే
వెతికే నా చెలివే
Written by: Krishna Kanth, M.M. Sreelekha