Music Video

#Uppena - Jala Jala Jalapaatham Full Video Song | Panja Vaisshnav Tej,Krithi Shetty| Buchi Babu| DSP
Watch #Uppena - Jala Jala Jalapaatham Full Video Song | Panja Vaisshnav Tej,Krithi Shetty| Buchi Babu| DSP on YouTube

Featured In

Credits

PERFORMING ARTISTS
Jaspreet Jasz
Jaspreet Jasz
Performer
Shreya Ghoshal
Shreya Ghoshal
Performer
Devi Sri Prasad
Devi Sri Prasad
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Shree Mani
Shree Mani
Songwriter

Lyrics

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను
మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే
ఇటు చూడకంటు మబ్బు రెమ్మ దాన్ని మూసెనే
ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను
సముద్రమంత ప్రేమ
ముత్యమంత మనసు
ఎలాగ దాగి ఉంటుంది లోపలా
ఆకాశమంత ప్రణయం
చుక్కలాంటి హృదయం
ఇలాగ బయట పడుతోంది ఈ వేళా
నడి ఎడారిలాంటి ప్రాణం
తడి మేఘానితో ప్రయాణం
ఇక నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను, తెంచలేదు లోకం
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
ఇలాంటి తీపి రోజు
రాదు రాదు రోజు
ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం
ఇలాంటి వాన జల్లు
తడపదంట ఒళ్ళు
ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం
ఎప్పుడూ లేనిదీ ఏకాంతం
ఎక్కడా లేని ఏదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు, నీలోన నేను, మనకు మనమే సొంతం
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలిగాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటాన్నౌతాను
Written by: Devi Sri Prasad, Shree Mani
instagramSharePathic_arrow_out