Lyrics

ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడపచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడపచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు రతికేళి రుఖ్మినికి రంగుమోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము రతికేళి రుఖ్మినికి రంగుమోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖచక్రాల సందుల వైదూర్యము సతమై శంఖచక్రాల సందుల వైదూర్యము గతియై మమ్ము గాచే కమలాక్షుడు గతియై మమ్ము గాచే కమలాక్షుడు గతియై మమ్ము గాచే కమలాక్షుడు ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము యేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము యేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము బాలునీవలె దిరిగే పద్మనాభుడు బాలునీవలె దిరిగే పద్మనాభుడు బాలునీవలె దిరిగే పద్మనాభుడు ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు
Writer(s): G.bala Krishna Prasad Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out