Music Video

Ninnu Chudagane Song With Lyrics - Loukyam Songs - Gopichand, Rakul Preet Singh, Anoop Rubens
Watch Ninnu Chudagane Song With Lyrics - Loukyam Songs - Gopichand, Rakul Preet Singh, Anoop Rubens on YouTube

Featured In

Credits

PERFORMING ARTISTS
Vijay Prakash
Vijay Prakash
Performer
Mohana
Mohana
Performer
COMPOSITION & LYRICS
Anup Rubens
Anup Rubens
Composer
Anantha Sriram
Anantha Sriram
Songwriter

Lyrics

హో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే
నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే
ఎపుడైతే నువ్వలా కనిపించావో ఇలా
మొదలైంది ఈ గుండెలోన గోల
ఎదురుగా నువ్వేలే, వెనకనా నువ్వేలే
పక్కన నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే
హో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే
ఓ చూపులో సూదున్నాదే, కళ్ళలో మందున్నాదే
సూది మందేదో ఇచ్చావే
హో నవ్వుతోనే నువ్వు గాలాలు వేస్తే
చేపలాగా చిక్కినాదే మది
బాపురే నీ రంగు బంగారూ కదే
గుర్తుకొస్తున్నాదే తెల్లార్లూ అదే
ఎలా నీకు దూరంగా నేనుండనే
ఎదురుగా నువ్వేలే, వెనకనా నువ్వేలే
పక్కన నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే
హో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే
హో ఎందరో ఎదురయ్యారే ఒక్కరూ నీలా లేరే
నిన్ను మించే అందం నీదే
హో చేతికందే లాగ నువ్వుండి ఉంటే
ఎంత కందేవోనే ఆ చెంపలు
ఆగలేనే నేను నిన్నే చేరాకా
ఖచ్చితంగా ఉండలేనే వేరుగా
ఎలా నిన్ను పొందాలో ఏమో మరి
ఎదురుగా నువ్వేలే, వెనకనా నువ్వేలే
పక్కన నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే
హో నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే
Written by: Anantha Sriram, Anup Rubens
instagramSharePathic_arrow_out